Adithya Info Hub
ప్రభుత్వ పథకాలు
కేంద్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ పథకాలు – అర్హతలు, కావాల్సిన పత్రాలు, దరఖాస్తు విధానం, స్టేటస్ చెక్.
ప్రభుత్వం వారీగా (By Government)
లబ్ధిదారుల వారీగా పథకాలు (Schemes by Beneficiary)
ప్రయోజనం వారీగా పథకాలు (Schemes by Purpose)
Latest in Govt Schemes
View all →




AP GO Ms 592 Residence Certificate: కొత్త నిబంధనలు

AP Street Vendors Credit Card Scheme: ₹30,000 రుణ కార్డులు

AP Free House Sites Scheme 2026: 3 సెంట్ల ఉచిత ఇంటి స్థలం

PM Viksit Bharat Rozgar Yojana 2026: PF ఖాతాదారులకు ₹15,000

NTR Bharosa Pension Field Verification 2026: కొత్త దరఖాస్తులు


AP Generic Medical Shop Scheme 2026: ₹4 లక్షల సబ్సిడీ

PM Kisan Annadata Sukhibhava 2026: స్టేటస్ చెక్ & విడుదల తేదీ
Govt Schemes: AP, Telangana & కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలుగులో
Govt schemes of the Central Government, Andhra Pradesh and Telangana are explained here in simple Telugu. ఈ విభాగంలో ప్రతి పథకానికి పూర్తి సమాచారం ఉంటుంది: ఎవరు అర్హులు, ఎంత ప్రయోజనం, కావాల్సిన పత్రాలు, ఎక్కడ ఎలా దరఖాస్తు చేయాలి, స్టేటస్ ఎలా చెక్ చేయాలి. అధికారిక GO లేదా ప్రభుత్వ పోర్టల్ అందుబాటులో ఉన్నప్పుడు దాని లింక్ ఇస్తాం. ఇంకా అధికారికంగా ప్రకటించని వార్తలను “అంచనా” అని స్పష్టంగా చూపిస్తాం.
మీకు కావాల్సిన విభాగం ఎంచుకోండి: కేంద్ర పథకాలు, ఏపీ పథకాలు, రైతు పథకాలు, పెన్షన్ పథకాలు. విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్స్ విభాగం చూడండి.
This section explains central, Andhra Pradesh and Telangana government schemes in Telugu: eligibility, benefits, documents, how to apply and how to check status, with the official link wherever one exists.
ప్రభుత్వ పథకానికి సురక్షితంగా దరఖాస్తు చేయడం ఎలా?
- అర్హత ముందుగా చూసుకోండి: వయస్సు, ఆదాయ పరిమితి, భూమి, కుల ధృవీకరణ వంటి నిబంధనలు ఆర్టికల్‌లో ఉంటాయి.
- పత్రాలు సిద్ధం చేసుకోండి: ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా (ఆధార్ లింక్), కుల / ఆదాయ ధృవీకరణ పత్రాలు.
- అధికారిక మార్గంలోనే దరఖాస్తు: గ్రామ / వార్డు సచివాలయం, మీసేవ లేదా ప్రభుత్వ పోర్టల్ ద్వారా మాత్రమే.
- డబ్బులు ఇవ్వొద్దు: ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు ఉచితం. డబ్బులు అడిగితే స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయండి.
- స్టేటస్ చెక్ చేయండి: ఆధార్ లేదా దరఖాస్తు నంబర్‌తో అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
అధికారిక వెబ్‌సైట్లు (Official websites)
- myScheme: కేంద్ర, రాష్ట్ర పథకాలన్నీ ఒకే చోట (Government of India)
- PM-KISAN: రైతులకు కేంద్ర ఆర్థిక సహాయం, స్టేటస్ చెక్
- National Scholarship Portal: కేంద్ర స్కాలర్‌షిప్స్
- Andhra Pradesh Government: ఏపీ ప్రభుత్వ అధికారిక పోర్టల్
- Telangana Government: తెలంగాణ ప్రభుత్వ అధికారిక పోర్టల్
తరచుగా అడిగే ప్రశ్నలు
పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి?
చాలా ఏపీ పథకాలకు గ్రామ / వార్డు సచివాలయంలో లేదా అధికారిక పోర్టల్‌లో దరఖాస్తు చేయవచ్చు. ప్రతి ఆర్టికల్‌లో దరఖాస్తు విధానం, అందుబాటులో ఉంటే అధికారిక లింక్ ఉంటాయి.
నా దరఖాస్తు స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
సంబంధిత పథకం అధికారిక వెబ్‌సైట్‌లో ఆధార్ లేదా దరఖాస్తు నంబర్‌తో చెక్ చేయవచ్చు. ఆ లింక్ ఆర్టికల్‌లో ఉంటుంది.
పథకాల కోసం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలా?
లేదు. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు ఉచితం. డబ్బులు అడిగే వారి గురించి స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయండి.
ఇక్కడి సమాచారం అంతా అధికారికమేనా?
అధికారిక GO లేదా పోర్టల్ ఆధారంగా రాసిన ఆర్టికల్స్‌లో ఆ లింక్ ఇస్తాం. ఇంకా ప్రకటించని పథకాల వార్తలను “అంచనా” అని చూపిస్తాం. దరఖాస్తు చేసే ముందు అధికారిక వెబ్‌సైట్ లేదా సచివాలయంలో తప్పనిసరిగా సరిచూసుకోండి.
సమాచారం ఎప్పుడు అప్‌డేట్ అవుతుంది?
ప్రభుత్వం కొత్త GO లేదా మార్పు ప్రకటించిన వెంటనే ఆర్టికల్‌ను అప్‌డేట్ చేసి తేదీ మారుస్తాం.